
సినిమాలు

తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు విదేశీయులు అక్రమంగా ఓటు వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో చెన్నై పోలీసులు దాదాపు 25 మందిని అరెస్ట్ చేశారు. వీరు భారత సంతతికి చెందినవారే అయినప్పటికీ శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరసత్వం పొందారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ నకిలీ ఓటర్ ఐడీలతో ఎన్నికల్లో ఓటు వేసినట్లు గుర్తించారు.
విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని చెన్నై, మదురై విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ అధికారులు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడమ చేతి చూపుడు వేలిపై ఉన్న సిరా గుర్తు ఆధారంగా అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వీరు చెన్నైలోని పలు నియోజకవర్గాల్లో ఓటు వేసినట్లు విచారణలో తేలింది. మరింత మంది ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!