
జనరల్

బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నేడు, రేపు రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చిన విదేశాంగ మంత్రులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. ఈ సమావేశంలో ఇరాన్–అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు, అలాగే ప్రపంచ స్థాయిలో ఉన్న ఇతర ముఖ్య సమస్యలపై చర్చ జరగనుంది.
అలాగే గ్లోబల్ గవర్నెన్స్‌లో మార్పులు, బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెంపు వంటి అంశాలపై కూడా చర్చలు జరుగుతాయి. అయితే ఈ సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి హాజరు కాకపోవడం విశేషం. ప్రపంచ రాజకీయాల్లో బ్రిక్స్ దేశాల పాత్రను మరింత బలపరచే దిశగా ఈ సమావేశం కీలకంగా భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!