

తెలంగాణ ఫోక్ పాటలకు యూట్యూబ్, సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తన అందం, అభినయం, నృత్య ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ‘తిన్న తీరం పడతలే’ అనే ఒక్క ఫోక్ సాంగ్‌తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ అందుకున్నట్లు తెలిపారు. ఆ పాట విడుదలైన తర్వాత తనకు వందకు పైగా అవకాశాలు వచ్చాయని, అదే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఫోక్ డ్యాన్సర్ మాత్రమే కాకుండా కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ పూర్తి చేసిన నాగదుర్గ ప్రస్తుతం పీహెచ్‌డీకి సిద్ధమవుతున్నారు. అలాగే తన సొంత డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా వంద మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. గతంలో ‘కలివి వనం’ చిత్రంలో నటించిన ఆమె, ఇప్పుడు ప్రియదర్శి సరసన ‘ఇడుపు కాయితం’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో నాగదుర్గ వెండితెరపై మరో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!