

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. క్యాచ్‌మెంట్ ప్రాంతాలు, ఇతర జల వనరుల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలెక్టరేట్ నుంచి అత్యవసర వరద హెచ్చరిక జారీ చేసి, లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శుక్రవారం ఉదయం 7:15 గంటలకు నారాయణపురం ఆనకట్ట వద్ద నీటి విడుదల 60,000 క్యూసెక్కులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వంశధార నదికి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నదుల్లోకి దిగడం, ఈత కొట్టడం, స్నానాలు చేయడం, చేపలు పట్టడం లేదా నది దాటేందుకు ప్రయత్నించడం చేయరాదని సూచించారు. అధికారులు సూచిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని, పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!