
సినిమాలు

ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖర్భూజా పండు తిన్న అనంతరం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను తొలుత కేంద్రపడ ఆసుపత్రిలో చేర్పించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కటక్‌లోని ఎస్సీబీ ఆసుపత్రికి తరలించారు.
బాధితుల్లో స్వాధీన్ సేనాపతి(13) అనే బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఖర్భూజా తిన్న తర్వాతే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించిందని బాధిత కుటుంబ సభ్యుడు మలాయ సేనాపతి ఆరోపించారు. అయితే ఘటనకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!