
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలుకానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!