

మార్కాపురం జిల్లా పామూరు పరిధిలో జాతీయ రహదారిపై ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ లారీ డ్రైవర్లు, యజమానులను బెదిరించి నగదు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.45,000 నగదు, ఒక ఎయిర్ పిస్టల్, నాటు తుపాకీ, కత్తి మరియు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12, 16 తేదీల్లో మట్టి లోడుతో వెళ్తున్న లారీలను అడ్డగించి తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి పామూరులోని విరాట్‌నగర్ సెంటర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు డి. మల్లికార్జున ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పుల్లో కూరుకుపోయి, తన సహచరులు బర్రె చిట్టిబాబు, మచ్చ వంశీలతో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ముగ్గురినీ కనిగిరి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ దుర్గాసి వినోద్ కుమార్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!