
రాజకీయాలు

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ఈ-ఆఫీస్ యాప్, ఉమాంగ్ (UMANG) యాప్‌లలో క్లెయిమ్ ప్రాసెసింగ్ సేవలు సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. ఈ అంశంపై ఎలాంటి అధికారిక అడ్వైజరీ జారీ చేయలేదని, అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని EPFO స్పష్టం చేసింది.
ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈపీఎఫ్‌వో ఈ ప్రచారాన్ని తప్పుడు మరియు దారితప్పించే సమాచారంగా పేర్కొంది. సభ్యులు సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సందేశాలను నమ్మవద్దని సూచించింది. సేవలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం EPFO వెబ్‌సైట్, అధికారిక కమ్యూనికేషన్ ఛానళ్లను మాత్రమే అనుసరించాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!