

ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్లపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కమెడియన్ నరేష్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన షోలో పాల్గొనేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జబర్దస్త్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. తనపై తానే సరదాగా జోకులు వేసుకునే ఆయన శైలి బిగ్‌బాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు, బిగ్‌బాస్ హౌస్‌లో ఫిజికల్ టాస్క్‌లు, 24/7 కెమెరాల మధ్య పోటీని ఆయన ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!