

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గ సభ్యులను లక్ష్యంగా చేసుకుని డర్టీ బాంబ్ లేదా రసాయనిక ఆయుధంతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన శ్వేతసౌధం ప్రతినిధి లారెన్ బిస్.. అమెరికాకు పొంచి ఉన్న ముప్పులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతానికి తక్షణ ప్రమాదం ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్ ఇలాంటి దాడులకు ప్రయత్నించే అవకాశాలను అమెరికా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకునే ముప్పు కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా ఆర్థిక ఆంక్షలకు సంబంధించిన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి స్కాట్ బెసెంట్ నివాసాన్ని గత వారం సీక్రెట్ సర్వీస్ అధికారులు మిలిటరీ స్థావరానికి మార్చినట్లు సమాచారం. డర్టీ బాంబు తయారీకి అవసరమైన రేడియోధార్మిక పదార్థాలను తరలించడం సులభమని, అమెరికాలో ఇప్పటికే ఉన్న ఇరాన్ పౌరులను ఈ కుట్రలో భాగస్వాములను చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర ధ్రువీకరణ లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!