
జనరల్

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతోనే తన 26 రోజుల నిరాహార దీక్షను ముగించినట్లు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం పరీక్షల వ్యవస్థలో మార్పులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన వీడియో సందేశంలో తెలిపారు.
పరీక్షల అక్రమాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించి, పరీక్షా విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చినట్లు వాంగ్చుక్ పేర్కొన్నారు. ఈ హామీల ఆధారంగానే తాను దీక్ష విరమించానని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!