
బిజినెస్

ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. ఈ విధానం ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, సీఎన్జీ ద్విచక్ర వాహనాల నమోదు నిలిపివేయబడుతుంది. ఆ తేదీ నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే నమోదు అనుమతించనున్నారు. అయితే ఇప్పటికే ఉన్న పెట్రోల్ లేదా సీఎన్జీ ద్విచక్ర వాహనాల వినియోగంపై ఈ నిర్ణయం ప్రభావం చూపదు.
అదే విధంగా, ఎక్స్‌షోరూమ్ ధర రూ.30 లక్షల వరకు ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుపై పూర్తి మినహాయింపు కల్పించనున్నారు. ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన రవాణాను ప్రోత్సహించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!