
సినిమాలు

తెలంగాణను 2034 నాటికి లక్ష కోటి డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు లక్షల కోట్లు డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ వాటా దాదాపు 5 శాతం ఉండగా, దానిని 2047 నాటికి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, స్థిరమైన పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు అందించామని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.600 కోట్లు కేటాయించామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, 200 ఎకరాల్లో ఏఐ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!