
ఓటీటీ

నార్వేజియన్ జర్నలిస్ట్ హెల్లే లింగ్ స్వెండ్సెన్, నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా అడిగిన ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. “ప్రపంచంలో అత్యంత స్వేచ్ఛ కలిగిన మీడియా నుంచి ప్రశ్నలు ఎందుకు తీసుకోవడం లేదు?” అంటూ ఆమె అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తరువాత హెల్లే లింగ్ స్వెండ్సెన్ “అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం మా బాధ్యత” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రధాని మోదీని సమర్థిస్తుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో మీడియా ప్రశ్నలు, జవాబుదారీతనం కీలకమని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై విస్తృత చర్చకు దారితీసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!