
క్రీడలు

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీబీఐ విచారణ మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం విజయవాడలోని కృష్ణలంక స్వర్గపురిని సందర్శించింది. సాయికృష్ణ మృతదేహాన్ని అక్కడే ఖననం చేసినట్లు సమాచారం ఉండటంతో అధికారులు అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా స్వర్గపురిలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు.
స్వర్గపురి సిబ్బంది రవి, డేనియల్‌తో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అక్కడి రికార్డులను పరిశీలించి, కేసుకు సంబంధించిన వివరాలను సేకరించారు. సుమారు గంటపాటు కొనసాగిన ఈ విచారణలో సిబ్బంది నుంచి కీలక సమాచారం తెలుసుకున్నట్లు సమాచారం. సాయికృష్ణ మృతికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!