

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తన వ్యాపారి నెట్‌వర్క్, డిజిటల్ చెల్లింపు మౌలిక వసతులను విస్తరించేందుకు భారీ ప్రణాళిక ప్రకటించింది. వచ్చే ఏడాది వ్యవధిలో 20,000 మందికి పైగా సేల్స్ సిబ్బందిని నియమించుకోవడంతో పాటు 50 లక్షలకు పైగా పేమెంట్ డివైజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్మార్ట్‌స్పీకర్లు, పీఓఎస్ పరికరాలు ఇందులో ఉండగా, వీటిలో సుమారు సగం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది.
ఇటీవల ప్రకటించిన ఎండీఆర్ విధానం వ్యాపారి నెట్‌వర్క్ విస్తరణలో దీర్ఘకాలిక పెట్టుబడులకు తోడ్పడుతుందని ఫోన్‌పే తెలిపింది. ఎండీఆర్ ద్వారా వసూలయ్యే మొత్తంలో 5 శాతాన్ని చిన్న వ్యాపారుల విస్తరణ కోసం ప్రత్యేక నిధికి కేటాయించడం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొంది. కొత్త కార్మిక చట్టాల్లో సరళీకృత నిబంధనలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడంలో సహాయపడుతున్నాయని తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!