
క్రీడలు

సినీ నటి మీనాక్షి చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన మీనాక్షిని చూసిన భక్తులు, అభిమానులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మీనాక్షి కూడా అభిమానులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మీనాక్షి చౌదరి.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ‘విశ్వకర్మ’ చిత్రం డిసెంబర్లో విడుదల కానుందని వెల్లడించారు. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులతో కెరీర్లో బిజీగా కొనసాగుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!