11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండు డీఏల విడుదలకు సీఎం రేవంత్‌ సానుకూలం?

Writer: Nithish 05:32 AM, 11 సెప్టెంబర్, 2026
రెండు డీఏల విడుదలకు సీఎం రేవంత్‌ సానుకూలం?

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం త్వరలో రెండు కరవు భత్యాలు (డీఏ) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 18న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్న నేపథ్యంలో అదే రోజు డీఏలపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. గురువారం అసెంబ్లీలో ఉద్యోగుల ఐకాస నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అరగంటపాటు చర్చించారు. పీఆర్‌సీ ప్రకటన, పెండింగ్‌ డీఏల విడుదల, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, ఈహెచ్‌ఎస్‌ అమలు, ఉద్యోగ సంఘాలకు ఓడీ సౌకర్యం తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో మూడు డీఏలను అసెంబ్లీ సమావేశాల్లోనే విడుదల చేయాలని నేతలు కోరగా.. ఎన్ని డీఏలు పెండింగ్‌లో ఉన్నాయంటూ సీఎం ఆరా తీసినట్లు సమాచారం. ఆయన స్పందనను బట్టి త్వరలో రెండు డీఏలు విడుదలయ్యే అవకాశం ఉందని ఐకాస నేతలు పేర్కొన్నారు.

పీఆర్‌సీ నివేదిక అందిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు ఐకాస తెలిపింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆర్థికశాఖతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని చెప్పారు. ‘మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలవొచ్చు.. నా ఆఫీస్‌ రచ్చబండ. రాత్రి సమయంలో కూడా వచ్చి కలిసి మాట్లాడొచ్చు’ అని సీఎం పేర్కొన్నట్లు నేతలు తెలిపారు. పెండింగ్‌ బిల్లుల కోసం నెలకు రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరగా, గత జనవరి నుంచి రూ.10 వేల కోట్లు విడుదల చేసినట్లు సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదికి పెండింగ్‌లో ఉన్న ఓడీ సౌకర్యంపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఐకాస నేతలు వెల్లడించారు. అంతకుముందు ఐకాస ప్రతినిధులు రెండో పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కలిసి నివేదికను త్వరగా సమర్పించాలని కోరారు. ఈ నెల 15న ఆర్థికశాఖ అధికారులతో చర్చిస్తానని ఆయన చెప్పినట్లు నేతలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

ట్యాగ్లు
తెలంగాణ ఉద్యోగులుడీఏకరవు భత్యంరేవంత్‌రెడ్డిపీఆర్‌సీఉద్యోగ సంఘాలుతెలంగాణ ప్రభుత్వంఉపాధ్యాయులుపెన్షనర్లుఈహెచ్‌ఎస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!