
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ను లోక్ భవన్లో కలిసి జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక సభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యతగల పౌరులుగా ప్రవర్తించాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు.
మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గతంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సూచించిన విషయం తెలిసిందే. గవర్నర్ సూచనలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొననున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!