11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Chandrika 06:03 AM, 11 అక్టోబర్, 2026
ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌నినో ప్రభావంతో రానున్న ఎనిమిది నెలలు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలులో ప్రజలను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో భవిష్యత్తులో విద్యుత్‌ కొరత తీవ్రతరం కావచ్చని హెచ్చరించారు. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో తగినంత విద్యుత్‌ అందుబాటులో లేకపోవచ్చని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, సాధ్యమైన చోట విద్యుత్‌ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దసరా తర్వాత సినిమా, మీడియా, కళాజాతలు తదితర మాధ్యమాల ద్వారా వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌పై వాటి ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కరవు మండలాల ప్రకటనతోపాటు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం నుంచి కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సాగులో ఉన్న పంటలకు అవసరమైన నీటిని అందించడం, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడడం, ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించే అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్‌రూమ్‌, టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ సరఫరాపై సీఎంవో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అక్టోబర్‌ 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని రైతువేదికల నుంచి రైతులు ఈ సమావేశంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇదే రోజు దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!

దుర్గా నవరాత్రులు 2026: ఏనుగు వాహనంపై దుర్గమ్మ.. ఈ నాలుగు రాశుల వారికి విశేష ఫలితాలు!

దుర్గా నవరాత్రి పూజా నియమాలు: అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగ పురోగతి, ఆర్థిక లాభాలు.. కొత్త అవకాశాలు!

ట్యాగ్లు
ఎల్‌నినోరేవంత్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వంవిద్యుత్‌ కొరతనీటి సంక్షోభంకరవు పరిస్థితులువ్యవసాయంరూ.20 వేల కోట్ల ప్యాకేజీతెలంగాణ రైతులుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య
సినిమాలు

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?
క్రీడలు

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...
రాజకీయాలు

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’
జనరల్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?
జనరల్

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!
జనరల్

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

దుర్గా నవరాత్రులు 2026: ఏనుగు వాహనంపై దుర్గమ్మ.. ఈ నాలుగు రాశుల వారికి విశేష ఫలితాలు!
జనరల్

దుర్గా నవరాత్రులు 2026: ఏనుగు వాహనంపై దుర్గమ్మ.. ఈ నాలుగు రాశుల వారికి విశేష ఫలితాలు!

దుర్గా నవరాత్రి పూజా నియమాలు: అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

దుర్గా నవరాత్రి పూజా నియమాలు: అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగ పురోగతి, ఆర్థిక లాభాలు.. కొత్త అవకాశాలు!
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగ పురోగతి, ఆర్థిక లాభాలు.. కొత్త అవకాశాలు!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున
షోస్

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్
రాజకీయాలు

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!