
జనరల్

తిరు.వి.క. నగర్ ఎమ్మెల్యే పల్లవి కుమారుడికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నామకరణం చేశారు. సోమవారం శాసనసభ కార్యక్రమాలు ముగిసిన అనంతరం సచివాలయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రిని పల్లవి తన పసిబిడ్డతో కలిసి కలిశారు. ఈ సందర్భంగా విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె, తన కుమారుడికి పేరు పెట్టాలని కోరారు.
పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి “తమిళ్ వెట్రి కొండాన్” అని నామకరణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పల్లవి, ‘జననాయగన్’ చిత్రంలో విజయ్ పాత్ర పేరు ‘వెట్రి కొండాన్’ అని, దాన్నే స్ఫూర్తిగా తీసుకుని తన కుమారుడికి ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. ఇకపై అతడిని సంక్షిప్తంగా ‘టీవీకే’ అని పిలుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా తన కుమారుడికి నామకరణం జరగడం తన చిరకాల కోరిక నెరవేరిన క్షణమని ఆనందం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!