10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి

Writer: Nithish 02:32 PM, 10 నవంబర్, 2026
తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి

ప్రజాకవి అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందెశ్రీ వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తన కలం, గళం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన అందెశ్రీ సేవలను కొనియాడారు. ‘జయ జయహే తెలంగాణ’ గేయం ఉద్యమ సమయంలో కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచిందని, తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు.

కవులు, సాహితీవేత్తల గొప్పతనాన్ని వారు రచించిన పుస్తకాల సంఖ్యతో కాకుండా, సమాజంపై వారి రచనలు చూపిన ప్రభావంతో అంచనా వేయాలని జూపల్లి అభిప్రాయపడ్డారు. ఆ కోణంలో అందెశ్రీ అత్యున్నత ప్రజాకవిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనా విధానాన్ని కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలన్న అందెశ్రీ ఆకాంక్షలను మన ఆలోచనలు, ఆచరణలో భాగం చేసుకున్నప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

ట్యాగ్లు
అందెశ్రీమంత్రి జూపల్లిజూపల్లి కృష్ణారావుఅందెశ్రీ వర్ధంతిజయ జయహే తెలంగాణతెలంగాణ సాహిత్యంప్రజాకవితెలంగాణ ఉద్యమంరవీంద్రభారతితెలంగాణ సంస్కృతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్
సినిమాలు

సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్

ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం.. నాలుగు జట్లలో భారీ మార్పులపై అంచనాలు
క్రీడలు

ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం.. నాలుగు జట్లలో భారీ మార్పులపై అంచనాలు

ఐపీఎల్‌ నిర్వహణపై జూహీ చావ్లా కీలక సూచన..
క్రీడలు

ఐపీఎల్‌ నిర్వహణపై జూహీ చావ్లా కీలక సూచన..

‘RX’తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన రెజీనా కసాండ్రా
సినిమాలు

‘RX’తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన రెజీనా కసాండ్రా

RC-17లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్
సినిమాలు

RC-17లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘హనుమాన్ అంశ్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘హనుమాన్ అంశ్’

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో CAT III సదుపాయం
జనరల్

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో CAT III సదుపాయం

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌..
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌..

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి
జనరల్

తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నీతూ సెల్ఫ్‌ హర్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లో నీతూ సెల్ఫ్‌ హర్ట్‌..

పవన్ కళ్యాణ్‌పై వేణు స్వామి పాత జోస్యం మళ్లీ వైరల్
సినిమాలు

పవన్ కళ్యాణ్‌పై వేణు స్వామి పాత జోస్యం మళ్లీ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!