

మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలంగాణ పోలీసుల తరఫున జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రమాణాల్లో తెలంగాణ ఈగల్ ఫోర్స్ 80 శాతానికి పైగా మార్కులు సాధించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి డ్రగ్స్ విక్రయం, వినియోగంపై సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢంగా పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!