

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఆధార్ వివరాలను నవీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సోమవారం నుంచి అక్టోబర్ 20 వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉచిత ఆధార్ నవీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇంకా చాలామంది విద్యార్థులు ఆధార్ నవీకరణ పూర్తి చేయకపోవడంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం 5 నుంచి 7 ఏళ్లలోపు పిల్లలు, 15 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు వేలిముద్రలు, కనుపాప గుర్తింపు వంటి బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలి. నవీకరణ చేయాల్సిన విద్యార్థుల జాబితాలను ఇప్పటికే పాఠశాలలకు పంపగా, మిగిలిన వారిని గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. ఈ శిబిరాల్లో ఆధార్ వివరాల సవరణలతో పాటు కొత్త ఆధార్ నమోదు కూడా ఉచితంగా చేస్తారు. అవసరాన్ని బట్టి జనన ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పదో తరగతి మార్కుల జాబితా లేదా చిరునామా ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!