
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. భారత్ పాలసీ డ్రైవెన్ గ్రోత్ వైపు పురోగమించిందని, డిజిటల్ ఇండియా, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశాన్ని బలోపేతం చేశాయని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ 2047తో అనుసంధానంగా “స్వర్ణాంధ్ర @2047” విజన్‌ను వివరించారు. ఏఐ ఆధారిత విద్య, రియల్ టైమ్ డేటా గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఆరోగ్య డిజిటలైజేషన్, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ప్రస్తావించారు. రెండు సంవత్సరాల్లో ₹23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, జనాభా నిర్వహణ వంటి రంగాల్లో సమూల సంస్కరణలు అవసరమని, కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం కీలకమని అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!