

వెనుకబడిన వర్గాలకు గౌరవప్రదమైన జీవనం, సామాజిక రక్షణ కల్పించడమే బీసీ రక్షణ చట్టం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర మంత్రులు తెలిపారు. విజయవాడలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ముసాయిదా బిల్లుపై కీలక సమావేశం నిర్వహించారు. చట్టంపై ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించిన ప్రభుత్వం, త్వరలో జిల్లా స్థాయిలో బీసీ సంఘాల ప్రతినిధుల సూచనలను కూడా తీసుకోనుంది. అనంతరం ముసాయిదాను జాతీయ బీసీ కమిషన్‌కు పంపించి, అనుమతులు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.
మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కులం లేదా సంప్రదాయ వృత్తుల పేరుతో బీసీలను దూషించడం, వేధించడం వంటి చర్యలకు కఠిన శిక్షలు ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచే దిశగా కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!