
జనరల్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23న విడుదలకు ఒక రోజు ముందుగా ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రీమియర్ షోకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ.400, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.300 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ నెల 24 నుంచి అక్టోబర్ 3 వరకు ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కాలంలో మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!