

హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రధాన కార్యాలయాన్ని రూ.100 కోట్లతో భారీగా విస్తరించాలని కేంద్ర మత్స్యశాఖ నిర్ణయించింది. రాజేంద్రనగర్‌లోని ప్రస్తుత ఐదు ఎకరాల ప్రాంగణానికి అదనంగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2006లో ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌డీబీ కార్యాలయాన్ని 2012లో చేప ఆకారంలో నిర్మించారు.
కొత్త విస్తరణలో భారీ ఆడిటోరియం, అంతర్జాతీయ మత్స్య ప్రదర్శన కేంద్రం, ప్రయోగశాలలు, మత్స్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ స్థాయి చేపలు, రొయ్యలు, జలచరాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ కేంద్రం కూడా నిర్మిస్తారు. ఎగుమతుల విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. 600 సీట్ల ఆడిటోరియం, రైతుల కోసం వసతిగృహాలు కూడా ఏర్పాటు చేస్తారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!