

ఎన్నిసార్లు చూసినా, విన్నా కొత్త అనుభూతిని అందించే అద్భుతమైన ఇతిహాసం రామాయణం. తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ గాథ ఆధారంగా ఇప్పటికే ఆదిపురుష్ సినిమా వచ్చినప్పటికీ, బాలీవుడ్ నుంచి మరో భారీ చిత్రం తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రామాయణాన్ని మరోసారి వెండితెరపై కొత్తగా చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఓ సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు థమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కలంలో ఎప్పటికీ సిరా అయిపోకూడదని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన మరిన్ని భారీ చిత్రాలు చేయాలని, అందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రామాయణం తెరకెక్కాలని తన కల అని వెల్లడించారు. ఆ సినిమా వస్తే మాయాబజార్ తర్వాత ఆ స్థాయిలో నిలిచే అద్భుతమైన చిత్రమవుతుందని, ఖచ్చితంగా 350 రోజులు ఆడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ కొత్త జానర్లలో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఆయన రామాయణాన్ని తెరకెక్కిస్తారేమో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!