
జనరల్

నటి అషు రెడ్డికి సీసీఎస్ పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు తల్లిదండ్రులకు కూడా నోటీసులు అందించినట్లు సమాచారం. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి రూ.10.5 కోట్లు కాజేశారంటూ బాధితుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా సీసీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ అషు రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అలాగే పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 9 కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!