

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో పుణెకు చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు మనీషా వాఘ్మారే కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. 46 ఏళ్ల మనీషా వాఘ్మారేను మే 14న సీబీఐ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణి, బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందరే అరెస్టుల సమయంలో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ప్రశ్నపత్రం తయారీ కమిటీలో సభ్యురాలైన మనీషా గురునాథ్‌కు బోటనీ, జువాలజీ పేపర్ల యాక్సెస్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.
సీబీఐ వివరాల ప్రకారం, భారీ మొత్తంలో డబ్బు చెల్లించగలిగే విద్యార్థులకు ప్రశ్నపత్రాలను చేరవేసే కుట్రలో వాఘ్మారే కీలకంగా వ్యవహరించింది. ఒక్కో విద్యార్థితో రూ.10 లక్షల వరకూ ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. లీకైన పేపర్లు మధ్యవర్తుల ద్వారా గురుగ్రామ్, జైపూర్‌లలోని ఏజెంట్లకు పీడీఎఫ్ రూపంలో చేరినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో లాతూర్కు చెందిన రెణుకై కెమిస్ట్రీ క్లాసెస్ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అతడి ఫోన్లో లీకైన ప్రశ్నపత్రాలు గుర్తించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!