
ఓటీటీ

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తును మరింత బలోపేతం చేసేలా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ ప్రాంతంలో నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులనైనా సీబీఐ దర్యాప్తు చేసేలా పూర్తి అధికారాలు కల్పించింది. దర్యాప్తు సమయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించింది.
దర్యాప్తు పేరుతో వాట్సాప్ వంటి డిజిటల్ వేదికల ద్వారా సమన్లు పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇలాంటి నేరాల్లో పాల్గొనే వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఈ మార్గదర్శకాలు కీలకంగా మారనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!