

సప్లిమెంట్లను రోజులో ఏ సమయంలో తీసుకుంటున్నామనే దానికంటే.. వాటిని సరైన విధంగా, క్రమం తప్పకుండా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లను కొద్దిగా కొవ్వు ఉన్న ఆహారంతో తీసుకుంటే శోషణ మెరుగ్గా ఉంటుంది. విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C వంటి నీటిలో కరిగే విటమిన్లను సాధారణంగా నీటితో తీసుకోవచ్చు.
ఐరన్‌ను సాధారణంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలోకి బాగా శోషించబడుతుంది. అయితే కొంతమందికి వికారం, కడుపునొప్పి లేదా మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉంటే కొద్దిగా ఆహారం తీసుకున్న తర్వాత ఐరన్ సప్లిమెంట్ తీసుకోవచ్చు. టీ, కాఫీ, కాల్షియం ఐరన్ శోషణను తగ్గించవచ్చు. విటమిన్ C మాత్రం ఐరన్ శోషణకు సహాయపడుతుంది. థైరాయిడ్ మందులు వాడేవారు ఐరన్‌తో తగినంత సమయం గ్యాప్ పాటించాలి.
ఒమేగా-3 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌ను కొద్దిగా కొవ్వు ఉన్న భోజనంతో తీసుకోవడం మంచిది. ఇలా తీసుకోవడం వల్ల శోషణ మెరుగుపడటంతో పాటు చేప వాసనతో వచ్చే తేన్పులు, వికారం వంటి ఇబ్బందులు కూడా కొంత తగ్గవచ్చు. కాల్షియం, ఐరన్‌ను ఒకేసారి తీసుకోకుండా వేర్వేరు సమయాల్లో తీసుకోవడం మంచిది. సప్లిమెంట్ మోతాదు, సమయం వ్యక్తిగత అవసరాలు మరియు వైద్యుల సలహాపై ఆధారపడి ఉండాలి.
గమనిక: వైద్యుల సలహా లేకుండా ఒకేసారి అనేక రకాల సప్లిమెంట్లు లేదా అధిక మోతాదులు తీసుకోవద్దు. ఎక్కువకాలం సప్లిమెంట్లు వాడేవారు, తరచుగా రక్తహీనత లేదా జీర్ణకోశ, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు అవసరమైన రక్త పరీక్షలు చేయించుకుని లోపం ఉందో లేదో నిర్ధారించుకోవడం మంచిది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!