

దశాబ్దాలుగా ఇళ్ల హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాల కలను సాకారం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 28,445 కుటుంబాలకు పూర్తి హక్కులు కల్పించనున్నట్లు చెప్పారు. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు సీఎం తెలిపారు.
25 వేల పేద కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. శాశ్వత హక్కులు కల్పించడం ద్వారా ప్రతి కుటుంబానికి ఆస్తి భద్రత, భవిష్యత్తుపై భరోసా, ఆత్మగౌరవం లభిస్తాయని అన్నారు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో సామాన్య కుటుంబాలను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని సీఎం తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!