

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రముఖ బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియాలోని గ్లాస్ వంతెనపై ఓ బాలుడు గొడుగుతో గ్లాస్ ప్యానెల్‌ను కొట్టడంతో కలకలం రేగింది. జూన్ 20న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా వంతెనపై ఉన్న పర్యాటకులను సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అధికారుల వివరాల ప్రకారం, గ్లాస్ వంతెనలోని ప్రతి ప్యానెల్‌కు మూడు రక్షణ పొరలు ఉన్నాయి. ఒక్కో ప్యానెల్ వేల కిలోల బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంది. బాలుడు కొట్టడంతో పైభాగంలోని ఒక రక్షణ పొర మాత్రమే దెబ్బతింది. మిగిలిన రెండు రక్షణ పొరలు ఎలాంటి నష్టం లేకుండా సురక్షితంగానే ఉన్నాయి.
దెబ్బతిన్న గ్లాస్ ప్యానెల్ స్థానంలో కొత్తదాన్ని అమర్చేందుకు తయారీ సంస్థను సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. ఈ వంతెనపై ఒకేసారి 100 మందికి పైగా పర్యాటకులు సంచరించవచ్చని పేర్కొంటూ, పర్యాటకుల భద్రత దృష్ట్యా మాత్రమే వారిని అక్కడి నుంచి తరలించినట్లు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!