
రాజకీయాలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి గోదావరి జలాల వినియోగంపై లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం జలాలను సద్వినియోగం చేయడంలో విఫలమవుతోందని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, సీతారామసాగర్, సమ్మక్క-సారక్క ప్రాజెక్టుల పనుల్లో ఆలస్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. సుమారు 200 టీఎంసీల నీరు వృథా అవుతోందని చెబుతూ, గోదావరి ప్రాజెక్టులపై వెంటనే దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!