
టెక్నాలజీ

ఛత్ పూజ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం భక్తుల భద్రతకు సంబంధించి కీలక చర్యలు చేపట్టింది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నదీ ఘాట్ల సమీపంలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. అలాగే ఈనెల13 నుంచి 16 వరకు ప్రైవేట్ పడవల నిర్వహణపైనా ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
పండుగకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రతా సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు, వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. ప్రమాదాలు, రద్దీ, తొక్కిసలాట వంటి ఘటనలను నివారించేందుకు అవసరమైన అత్యవసర పరికరాలను కూడా సిద్ధం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!