

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (BIACH&RI) రజతోత్సవాల ముగింపు వేడుకలు జూన్ 22న హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవోటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, 2000లో ప్రారంభమైన ఈ సంస్థ 25 ఏళ్ల సేవలను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఎన్టీఆర్ మరియు బసవతారకం ఆశయాల ప్రకారం సేవలను కొనసాగిస్తోందన్నారు. రజతోత్సవాల సందర్భంగా ఏడాది పొడవునా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పీ. నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారులతో కేక్ కట్ చేసి బహుమతులు అందజేసిన బాలకృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి కోసం విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!