
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సమావేశమై రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు.
మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరుగనున్న బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతారు. అనంతరం నీతి ఆయోగ్ సభ్యులు, ఆర్థిక సలహా మండలి చైర్మన్‌తో కూడా చర్చలు జరపనున్నారు. రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!