
సినిమాలు

ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సెలవు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ముందుగా ప్రకటించిన ఈ నెల 27కు బదులుగా 28న బక్రీద్ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రదర్శనం ఆధారంగా బక్రీద్ పండగ తేదీ మారడంతో సెలవు రోజును కూడా మార్చాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం సెలవును ఈ నెల 28కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!