
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
గత 22 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు సాధించగలిగామని ఆయన వెల్లడించారు. అలాగే భారత గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి నిరాఘాటంగా సాగుతోందని ప్రశంసించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి మోదీ సూచించిన చర్యలను అందరూ పాటించాలని ఆయన సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!