

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం 2022 నుంచి 2026 మధ్య ఎన్నికల్లో గెలిచిన తర్వాత 111 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలు మార్చారు. ఇందులో 26 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వ్యక్తిగత పార్టీ మార్పులు, పార్టీ విలీనాలు, రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భాలు, అనర్హత తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన కేసులను ఈ విశ్లేషణలో చేర్చారు.
రాష్ట్రాల వారీగా చూస్తే నాగాలాండ్‌లో 32 కేసులతో అత్యధికంగా నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో 20, తెలంగాణలో తొమ్మిది, గోవా మరియు పంజాబ్‌లో ఎనిమిది చొప్పున, మహారాష్ట్రలో ఆరు కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో పార్టీ మారిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికైనవారు కాగా, కాంగ్రెస్ ప్రధానంగా వారిని చేర్చుకున్న పార్టీగా ఏడీఆర్ పేర్కొంది. ఈ డేటా పూర్తిగా సమగ్రంగా ఉండకపోవచ్చని, ప్రజాప్రతినిధుల పార్టీ మార్పులపై క్రమబద్ధమైన అధికారిక డేటాబేస్ అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణమని ADR తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!