

మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లోని పుప్పాలగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో భీమ్‌రెడ్డితో ఆర్థిక, ఇతర లావాదేవీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మంది ఇళ్లపై అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్‌లో మొత్తం 10 ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో బొమ్మ వెంకటేష్ ఇంట్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, సుమారు 14 లీటర్ల విదేశీ మద్యం లభించినట్లు ఏసీబీ వెల్లడించింది. మద్యం విషయాన్ని ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించినట్లు తెలిపింది. భీమ్‌రెడ్డి కేసులో బినామీ పేర్లపై ఉన్నట్లు అనుమానిస్తున్న ఆస్తులు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వస్తువులను పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!