

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్ పేరుతో సుమారు 23 వేల పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు (జూన్ 23) తెలంగాణవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్యా అవకాశాలను దెబ్బతీస్తుందని ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేసింది.
అదేవిధంగా, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పెరుగుతున్న ఫీజుల దోపిడీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను నిరుపేద విద్యార్థులకు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరింది. ఈ బంద్‌కు విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరియు ప్రజలు సహకరించాలని ఏబీవీపీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!