
రాజకీయాలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని కలిసి 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మహాసభల సందర్భంగా నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించారు.
సమావేశంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి ఆటా మహాసభలకు హాజరవుతానని సీఎం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!