

హర్యానాలోని జింద్‌లో ఒక హృదయాన్ని తాకే సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 39 ఏళ్ల పాటు నర్సింగ్ ఆఫీసర్‌గా సేవలందించి పదవీ విరమణ చేసిన షాన్ దేవికి ఆమె కుమారుడు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. తల్లికి కొత్త కారును కానుకగా ఇవ్వడమే కాకుండా, ఆ కారును పూలు లేదా రిబ్బన్లతో కాకుండా రూ.10 నోట్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ కారును తల్లి స్వయంగా నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షాన్ దేవి జులానా ప్రాంతంలోని జైజైవంతి పీహెచ్సీలో నర్సింగ్ ఆఫీసర్‌గా సేవలందించారు. పదవీ విరమణ రోజున ఆమె బయటకు వస్తుండగా కుమారుడు ఈ సర్ప్రైజ్ను సిద్ధం చేశాడు. కారును రూ.10 నోట్లతో అలంకరించడంతో పాటు ముందున్న అద్దంపై తల్లి ఫోటోను ఉంచి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ సంఘటనను చూసిన నెటిజన్లు కుమారుడి ప్రేమ, సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!