
షోస్

దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగ నియామకాల విధానంలో మార్పులు చేస్తోంది. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాలున్న అభ్యర్థులకు నియామకాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
భవిష్యత్తులో సంస్థ నియమించుకునే కొత్త ఉద్యోగుల్లో సుమారు 80 శాతం మంది డిజిటల్, ఏఐ నైపుణ్యాలు కలిగినవారే ఉంటారని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్ తెలిపారు. సంస్థ నియామక వ్యూహంలో ఈ నైపుణ్యాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ నిర్ణయం సూచిస్తోంది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ మొత్తం ఆదాయంలో ఏఐ ఆధారిత సేవల వాటా 10 శాతానికి చేరిందని ఆమె వెల్లడించారు. ఏఐ సేవల ద్వారా వచ్చే ఆదాయం పెరగడం సంస్థ లాభాల మార్జిన్లను మెరుగుపరచడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!