
జనరల్

ఫుడ్ డెలివరీ మరియు క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ మార్చి త్రైమాసికంలో తన పనితీరును మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్ నష్టం గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,081 కోట్ల నుంచి తగ్గి రూ.800 కోట్లకు చేరింది. ఆదాయం 45 శాతం పెరిగి రూ.6,383 కోట్లుగా నమోదైంది. అయితే వ్యయాలు కూడా రూ.7,448 కోట్లకు పెరిగాయి.
ఫుడ్ డెలివరీ విభాగంలో స్థూల ఆర్డర్ విలువ 15 త్రైమాసికాల గరిష్టానికి చేరి రూ.9,006 కోట్లుగా నమోదైంది. క్విక్ కామర్స్ విభాగం 68 శాతం వృద్ధితో రూ.7,881 కోట్లకు చేరింది. దీర్ఘకాలంలో ఈ విభాగం మరింత వృద్ధి సాధిస్తుందని సంస్థ అంచనా వేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!