
సినిమాలు

స్టాక్ మార్కెట్లో మూడు రోజులుగా కొనసాగిన ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. ప్రామాణిక సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో సెన్సెక్స్ 666 పాయింట్లకు పైగా పడిపోయి 83,151 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకగా, చివరికి 503.76 పాయింట్ల నష్టంతో 83,313.93 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 133.20 పాయింట్లు తగ్గి 25,642.80 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలో నెగటివ్ ట్రెండ్ కొనసాగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే వారాంతంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి విక్రయాలకు మొగ్గుచూపారు. ఇదిలా ఉండగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు బలపడి రూ.90.34 వద్ద స్థిరపడింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!