

భారత స్టాక్ మార్కెట్ బుల్ రన్ సెప్టెంబర్ 2026 నాటికి 2,370 రోజులకు చేరి దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన బుల్ రన్‌గా కొనసాగుతోందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మంత్రుల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తులు, అప్పుల ప్రకటనలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం కేంద్ర కేబినెట్లో 30 మంది మంత్రులు ఉన్నారు.
ఆస్తుల ప్రకటనల ఆధారంగా ఎనిమిది మంది కేబినెట్ మంత్రులు షేర్లు లేదా ఇతర మార్కెట్ పెట్టుబడులు లేకుండా కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదిక పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్, పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాం, వస్త్ర శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. మిగిలిన మంత్రుల్లో కొందరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు భూమి, బంగారం వంటి ఆస్తుల్లోనూ పెట్టుబడులు కలిగి ఉన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!